calender_icon.png 12 September, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి

12-09-2025 05:36:22 PM

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబర్ పేట్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని,  రోగులకు మెరుగైన వైద్యం అందించాలని,అధికారులను  ఆదేశించారు.

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్య సిబ్బంది గర్భిణీల పేర్లను విధిగా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. సాధారణ ప్రసవాలు 90% ఉండేలా  చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను, సిబ్బంది హాజరు ను పరిశీలించారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.