12-09-2025 06:05:53 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం నుండి పలుగుల గ్రామానికి 7 కిలోమీటర్లు డబల్ రోడ్డు నిర్మాణానికి రూ. 22 కోట్ల నిధులు రోడ్లు భవనాల శాఖ మంజూరు చేసినట్లు శుక్రవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కాళేశ్వరం పలుగుల డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ డబుల్ రోడ్డు నిర్మించడం వల్ల పలుగుల, కుంట్లం, కాళేశ్వరం,మద్దులపల్లి గ్రామాల్లోని ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.