calender_icon.png 12 September, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నాం

12-09-2025 05:51:12 PM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని

హనుమకొండ,(విజయక్రాంతి): అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్ జ్యోతి బసు నగర్ మరియు 53 వ డివిజన్ సరస్వతి నగర్ లో రూ.92.50 లక్షలతో అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులు,ప్రజలతో కలసిన కాలనీల పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతునాడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ 80% పనులను పూర్తి చేశామని తెలిపారు.శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు.గతంలో వర్షాకాలం వస్తే వరదలో హనుమకొండ అనే శీర్షికలు ఉండేవి అని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్వత్వంలో ఒకటి రెండు మినహా వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజల సహకారం ఉండాలని వెల్లడించారు.