calender_icon.png 27 July, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య సేవకు మించిన సేవ లేదు

27-07-2025 06:24:00 PM

ఎమ్మెల్యే మేఘారెడ్డి..

వనపర్తి (విజయక్రాంతి): సమాజంలో వైద్య సేవలు ఎంతో గొప్పవని ఆపత్కాలంలో వైద్య సేవలు అందించే వైద్యులు భగవంతునితో సమానమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి(MLA Tudi Megha Reddy) పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలో పాతబస్టాండ్ ఎదురుగా వైద్యుడు వివేక్ నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాస్ట్రోలివర్, ఎండోస్కోపీ, వైద్యశాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ వైద్యశాలలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చకూడదని బాధితులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్లచందర్, పట్టణ పట్టణ ప్రముక వైద్యులు పగిడాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, సమన్వయకర్త లక్కాకుల సతీష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.