ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి
09-04-2026 12:35 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, ఏప్రిల్ 8(విజయక్రాంతి):ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఇవిఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ నెలవారీ తనిఖీ చేశారు. ఇవిఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించి, పనిచేస్తున్నవి, లేనిది అడిగి తెలుసుకున్నారు.
అత్యవసర సైరన్ మొగుతున్నది పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టు ల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. భద్రతా లోపాలు లేకుండా చూడాలన్నారు. తనిఖీ రిజిస్టర్లలో కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు ఎన్నికల డిటి అన్సారీ, అధికారులు తదితరులు ఉన్నారు.




