9 April, 2026 | 2:46 AM

గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న వ్యక్తిపై దాడి

09-04-2026 12:35 AM

మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంఘటన

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి 

బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు

ఎల్బీనగర్, ఏప్రిల్ 8: హైదరాబాద్‌లో గోవుల అక్రమ రవాణా చేస్తుండగా, అడ్డుకున్న వ్యక్తిపై కత్తులు, కర్రలతో దాడికి పాల్పడిన ఘటన బుధవారం హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లమ్మ చౌరస్తా వద్ద కలకలం రేపింది. గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గోవులను తరలిస్తున్న వాహనాన్ని వెంట వస్తున్న కారులోని గుర్తుతెలియని దుండగులు ప్రేమ్‌కుమార్‌పై దాడికి దిగారు.

సుమారు ఏడుగురు కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసినట్టు సమాచారం. దాడి లో గాయపడిన ప్రేమ్‌కుమార్ స్థానికుల సహాయంతో బయటపడి అనంతరం మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఘటనపై కేసు నమో దుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసు కోవా లని హిందూ ధర్మ రక్షకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల  శ్రీరాములు డిమాండ్‌చేశారు. మీర్‌పేట్ సీఐ శంకర్‌నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.