calender_icon.png 5 October, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగుపాటుకు మహిళ మృతి

05-10-2025 05:10:27 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షంతో పాటు పిడుగుపాటుకు ఒక మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిపిలవంచ గ్రామానికి చెందిన ఇసునం లక్ష్మి(48) అనే మహిళ రోజువారిగా వెళుతున్న కూలీ పనుల్లో భాగంగా పత్తి చేనుకు వెళ్ళింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కురిసిన అకాల వర్షంతో పాటు పిడుగుపాటుకు లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. లక్ష్మి భర్త రాజయ్య గత నాలుగేళ్ల కిందట చనిపోయారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.