calender_icon.png 17 September, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

17-09-2025 07:33:12 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలుకు మంజూరైన రూ.24000 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును బిఆర్ఎస్ నాయకుకడు పంజా స్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం,ఆరోగ్యం పట్ల  ముఖ్యమంత్రి సహాయనిది పథకం పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.