నానో యూరియా అంటగడుతున్నారు
13-05-2026 12:00 AM
- సొసైటీ ఆఫీసుకు తాళం వేసి రైతుల నిరసన
- నిజామాబాద్ జిల్లా హెగ్డేలిలో ఘటన
బాన్సువాడ, మే 12 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోతంగల్ సహకార సంఘం పరిధిలోని హెగ్డేలిలో రైతులు సొసై టీకి తాళం వేసి మంగళవారం నిరసన తెలిపారు. పోతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డేలి గ్రామంలో తమకు అవసరం లేని నానో యూరియా లిక్విడ్, అంట గట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో తీసుకున్న లిక్విడ్ మిగిలిపోయి ఉందన్నారు. ౩ సంచుల ఎరువులు తీసుకుం టే ఒక లిక్విడ్ బాటిల్ తీసుకోవాల్సిందేనని సొసైటీ అధికారులు పేర్కొంటున్నారని, దీం తో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్య క్తంచేశారు. ఈ లిక్విడ్‌తో రైతులపై రూ.200 అదనపు భారం పడుతుందన్నారు.






