13 May, 2026 | 1:31 AM

ఉమ్మడి పాలమూరులో నకిలీ క్లినిక్‌లు సీజ్

13-05-2026 12:00 AM

నాగర్‌కర్నూల్, మే 12 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో వైద్యం అందిస్తున్న నకిలీ వైద్యులు, అనధికార వైద్య సేవలపై మంగళవారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక దాడులు నిర్వహించింది. నాగర్‌కర్నూల్ పట్టణం, బిజినేపల్లి గ్రామం, వనపర్తి జిల్లా బుద్దారం గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను డాక్టర్ కిరణ్ కుమార్ తోటవార్, డాక్టర్ సన్నీ డేవిస్ అయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు.

అనుమతులు లేకుండా నడుస్తున్న పలు క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు గుర్తించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సుశ్మిత హెల్త్ క్లినిక్, రహీమ్ క్లినిక్, శ్రీ సాయి క్లినిక్, రోహిణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శ్రీ దుర్గా క్లినిక్, లక్ష్మి క్లినిక్, అభిరామ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రాఘవేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ తదితర కేంద్రాలు అనధికారంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు.