01-12-2024 03:23:04 AM
శేరిలింగంపల్లి, నవంబర్ 30 : మాదాపూర్‌లోని శిల్పా రామంలో శనివారం వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పద్మ కల్యాణ్ నేతృత్వంలో శంభు కింకిణి నృత్యోత్సవం నిర్వహించారు. అరుణ స్వరూప్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా మండోదరి శబ్దం, ఎంత చక్కని వాడే, జావళి, డెబీజాని కళారూపాలు ప్రదర్శించారు.
కథక్ నృత్య ప్రదర్శనలో భాగంగా శివస్తుతి, తీన్‌తాల్, తుమ్రి, తులసీదాస్ భజన్; శోభన మిత్రదాస్ ఆధ్వర్యంలో మణిపురి నృత్య ప్రదర్శనలో సాగింది. కుమారి సాయి మనస్విని ఆంధ్రనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులకు అలరించారు. కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయ అసో సియేటివ్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నశ్రీ, దూరదర్శన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ మధు, డాక్టర్ రుద్రవరం సుధాకర్, శేషసాయి తదితరులు పాల్గొన్నారు.