calender_icon.png 17 July, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి విషాదం మృతులు 40 మంది

03-07-2025 12:57:34 AM

  1. ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం
  2. 33 మంది క్షతగాత్రుల వైద్య ఖర్చులు భరిస్తాం: కంపెనీ యాజమాన్యం
  3. 18 మంది మృతదేహాల గుర్తింపు 
  4. లభ్యంకాని 11 మంది ఆచూకీ! 
  5. ఆందోళనలో బాధిత కుటుంబీకులు 
  6. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

సంగారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. పేలుడు ఘటనపై ఎట్టకేలకు బుధవారం కంపెనీ యాజమాన్యం స్పందించింది. మొత్తం 40 మంది మృతి చెందారని, 33 మంది గాయపడ్డారని స్పష్టం చేసింది. మృతిచెందిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ. కోటి పరిహారం, క్షతగాత్రుల వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించింది.

అయితే బుధవారం మృతిచెందిన వారిలో 18 మంది కార్మికులను గుర్తించి, కుటుంబీకుల కు అప్పగించారు. 11 మంది కార్మికుల జాడ తెలియకపోవడంతో వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. బుధవారం పరామర్శకు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తోపాటు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి దా మోదర రాజనర్సింహను బాధిత కుటు ంబీకులు అడ్డుకుని, నిరసన వ్యక్తం చేశా రు. చుట్టుముట్టి తమకు న్యాయం చే యాలంటూ డిమాండ్ చేశారు. 

సీఎం హెచ్చరికతో స్పందించిన యాజమాన్యం 

సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనపై యాజమాన్యం ఎట్టకేలకు స్పందించిం ది. సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో హె చ్చరించడంతో కంపెనీ యాజమాన్యం బుధవారం స్పందించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీకి ఓ లేఖ రాసింది. పేలు డు ఘటనలో 40మంది కార్మికులు మృతిచెందగా 33మంది గాయపడిన ట్లు ఆ కంపెనీ సెక్రటరీ వివేక్‌కుమార్ పేరుమీద ప్రకటన విడుదల చేసింది.

90 రోజుల పాటు కంపెనీ ఆపరేషన్స్ నిలిపివేస్తున్నామని, అలాగే మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యఖర్చులతో పాటు వారికి భరోసా కల్పించనున్నట్లు ప్రకటించింది. కానీ యాజమాన్యం మా త్రం బాధితులను పరామర్శించలేదు.

శవాల ముద్దలుగా కార్మికులు

పరిశ్రమలో జరిగిన పేలుడులో కా ర్మికుల శవాల ముద్దలు బయటపడుతున్నాయి. పేలుడు ధాటికి మూడు అంత స్థుల భవనం కుప్పకూలడంతో వాటి కింద విగతజీవులుగా మారిన కార్మికు లు మంటల్లో దహనం అయ్యారు. శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఒక్కొక్క టిగా శవాల ముద్దలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు 40 మంది మృ తి చెందగా మరో 38 మంది చికిత్స పొందుతున్నారు.

18 మంది మృతదేహాలను గుర్తించి, మృతదేహాలను కుటుం బ సభ్యులకు బుధవారం అప్పగించా రు. మరో 18 మాంసపు ముద్దలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా 11 మంది ఆచూకీ లభించలేదని బుధవారం వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి దా మోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. వారి జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అసలు ఆ 11 మం ది ఎవరు?ఎక్కడ ఉన్నారు? వారి మాం సం ముద్దలైనా మిగిలాయా? అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు గో ప్యంగా ఉంచుతుందో అర్థంగాని ప్రశ్న. ఒకవేళ 11 మంది ఆచూకీ లభించకుంటే ఈ ప్రమాదంలో అధికారికంగానే 47 మంది మృతి చెందినట్లు నిర్ధారించాల్సి ఉంటుంది.

అయితే 11 మంది ఆనవా ళ్ళు కూడా మిగలకుండా బూడిదయ్యా రా? వీరంతా పేలుడుకు అతి దగ్గరలో ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబీకులు మా త్రం సిగాచి కంపెనీ ముందు కన్నీటి రో ధన పెడుతున్నారు. తమవారి ఆచూకీ లభించకపోవడంతో ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. అనధికారికంగా ఇప్పటికే 45 మంది మృత్యువాత పడినట్లు ప్రచారం సాగుతోంది.