calender_icon.png 16 October, 2024 | 12:47 AM

ఔను.. వాళ్లిద్దరు విడిపోయారు

19-07-2024 12:11:01 AM

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయినట్లు గురువారం అధికారికంగా ప్రకటించాడు. దీంతో పాండ్యా, స్టాంకోవిక్‌ల నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెరపడింది. ఈ విష యాన్ని వాళ్లిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ‘నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కలిసి బతికేందుకు ప్రయత్నించాం.. కానీ కుదరలేదు. దీంతో ఇద్దరి ప్రయోజనాల మేరకే ఈ కఠిన నిర్ణయం.

మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపమయిన అగస్త్యకు మా ప్రేమ ఎల్లప్పు డూ ఉంటుంది. కో పేరెంట్‌గా వాడికి అన్నీ సమకూర్చడంతో పాటు సంతోషంగా ఉంచుతాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. 2020 మే 31న హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు అదే ఏడాది జూలై 30న అగస్త్య జన్మించాడు. కాగా ఫిబ్రవరి 14, 2023లో బంధువులు, స్నేహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు.