25-04-2025 02:39:37 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : ఎన్నో సమస్యలతో ప్రజలు పోలీస్ స్టేషన్ కు వస్తారని వారిని చిరునవ్వుతో పలకరించి వారి సమస్యను అవగతం చేసుకోవాలని వర్టికల్ డి.ఎస్.పి సుదర్శన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏ ర్పాటుచేసిన సమావేశంలో పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వచ్చే వ్యక్తులను మర్యాదగా పలకరించడం, వారి సమస్యలను ఆలకించాలన్నారు. వచ్చిన వారిని దూషించకుండా, వినయంగా వ్యవహరించాలని, వచ్చిన ఫిర్యాదులను రికార్డు చేయడం, తగిన అధికారి, విభాగానికి పంపించాలని పేర్కొన్నారు. ప్రజలు అడిగే సాధారణ సమాచారాన్ని స్పష్టంగా, సమగ్రంగా చెప్పాలన్నారు.
సీసీ టీఎన్‌ఎస్ నందు సరియైన సమయానికి అప్డేట్ చేయడం, ఫిర్యాదుల నమోదు, సందర్శకుల రిజిస్టర్, అడిగిన సమాచారం తదితరాలను క్రమంగా న మోదు చేయాలని తెలిపారు. వ్యక్తిగత,సున్నితమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు. స్టేషన్కి వచ్చే వివాదాల మధ్య మధ్యవర్తిత్వం చేయడం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. ప్రజలతో సహానుభూతితో వ్యవహరించడం, వారి సమస్యలను పూర్తిగా అవగతం చేసుకోవాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో పోలీసులున్నారు.