calender_icon.png 21 August, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోల్డ్ సీన్స్ చేస్తేనే ఇక్కడుంటాం

21-08-2025 12:00:00 AM

కొందరికి అవకాశాలు వస్తున్నా హీరోయిన్‌గా రాణించలేకపోతారు. అలా ఒకట్రెండు సినిమాలతోనే తెరమరుగైపోయే భామలెందరో! ఈ క్రమంలో గ్లామర్ గేట్లు ఎత్తేసి, అందచందాలతో కవ్విస్తుంటారు. సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ప్రతిభ ఉంది కదా హవా సాగిస్తామంటే కుదరదు.

గ్లామర్, టాలెంట్.. వీటిలో ఏ ఒక్కదాన్నో మాత్రమే నమ్ముకుంటే అవకాశాలు మొహం చాటేస్తాయంతే! గ్లామర్ షో చేయకుండానే స్టార్ హీరోయిన్లు అయినవాళ్లు లేరా? అంటూ సావిత్రి, సౌందర్య పేర్లను ప్రస్తావించేవారూ లేకపోలేదు! కానీ, అన్ని కాలాలు, అందరి విషయంలో అలా జరగదు. తమన్నా భాటియా తొలినాళ్లలో తెల్లని మేనిఛాయ, అమాయకమైన ముఖవర్చస్సుతో క్యూట్‌గా కనిపించేది.

దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ మిల్కీ బ్యూటీ.. ఛాన్సులు తగ్గిపోవడంతో రూటు మార్చేసింది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలకూ ఐటెమ్ గాళ్‌గా అలరిస్తోంది. ఘాటైన రొమాన్స్, లిప్‌లాక్‌లతో వెండితెరకే వేడి పుట్టిస్తోంది. ఆమె నడుము అందాలకే సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది తమన్నా. “కెరీర్ ఆరంభంలో నాకు నేనే కొన్ని నిబంధనలు పెట్టుకున్నా.

మంచి పాత్రలు పోగొట్టుకున్నా. నో కిస్ పాలసీని కఠినంగా చాలా కాలంపాటు అమలు చేశా. హీరోయిన్‌గా అవకాశాలు ఎప్పుడైతే తగ్గాయో ఆ పాలసీకి గుడ్‌బై చెప్పేసి గ్లామర్ రోల్స్ చేయడం మొదలుపెట్టా. అదే నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇలా నన్ను నేను మార్చుకోకపోతే ఇండస్ట్రీ నుంచి ఎప్పుడో వెళ్లిపోయేదాన్ని. మార్పును ఆహ్వానిస్తే ఎక్కడైనా నిలదొక్కుకోగలు గుతాం” అని తెలిపింది తమన్నా.