calender_icon.png 17 November, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన దొంగ అరెస్ట్ రిమాండ్

17-11-2025 07:52:31 PM

- నిందుతుని వద్ద 20,150/- రూపాయలు స్వాధీనం

- సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని అరెస్ట్

- వివరాలు వెల్లడించిన పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఈ సందర్బంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ... సిరిసిల్ల పట్టణ పరిధిలోని  మెహర్ నగర్ కి చెందిన  గాదె రాణి అనే వృద్ధురాలు ఇంటిలో ఒక్కతే తలుపులు దగ్గర పెట్టుకొని పడుకొని ఉండగా సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ కి చెందిన మెరుగు భాస్కర్ అనే వ్యక్తి  తేదీ15-11-2025 రోజున మధ్యాహన సమయంలో తలుపులు తీసుకిని  లోనికి వచ్చి గాదె రాణి మెడలోని బంగారు పుస్తెల దొంగలించె ప్రయత్నంలో రాణి పుస్తేల తాడుని గట్టిగా పట్టుకొనగా దొంగ చేతికి పూస్తే, రెండు గుండ్లు రాగా వాటిని పట్టుకొని దొంగ పారిపోగా, రాణి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో బాగంగా రెండు బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా భాస్కర్ ని తన ఇంటి వద్ద అరెస్ట్ చేసి విచారించగా భాస్కర్ నేరం ఒప్పుకొనగా దొంగిలించిన సొత్తు అమ్ముకొని వచ్చిన డబ్బులు జల్సాలకు వాడుకోగా మిగిలిన డబ్బులు సీజ్ చేసి రిమాండ్ కి.తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.విధిగా ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా నేరాలను నియంత్రించవచ్చని,సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని  ఇన్స్పెక్టర్ తెలిపారు