calender_icon.png 17 November, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు చేయూతనందించేందుకే దుద్దిళ్ల చేయూత పథకం

17-11-2025 07:51:30 PM

కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు 

కమాన్ పూర్ (విజయక్రాంతి): పేదలకు చేయూతనందించేందుకే దుద్దిళ్ల చేయిత పథకం ప్రారంభించామని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో సోమవారం కమాన్ పూర్ గ్రామానికి చెందిన మేకల వెంకటలక్ష్మి అనారోగ్యంతో మరణించగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి దుద్దిళ్ల చేయిత కింద బియ్యం అందజేశామని, వారి కుటుంబానికి దుద్దిళ్ల కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట మురళి మనోహర్ రావు, జంగపల్లి శ్రీను, లల్లు, బొజ్జ సతీష్, బూంపేల్లి రాజయ్య, అనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు.