18 April, 2026 | 2:20 AM

అంగన్ వాడీ కేంద్రంలో దొంగలు

18-04-2026 12:35 AM

తాళం పగలగొట్టి, పిల్లల గుడ్లు పట్టుకెళ్ళిన ,చిల్లర దొంగలు

తుంగతుర్తి, ఏప్రిల్ 17 :గడచిన కొంతకాలంగా తుంగతుర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో రాత్రి వేళల్లోనే కాక ,పగటి వేళల్లో కూడా తాళం వేసి ఉంటే జోరుగా దొంగతనాలు జరుగుతున్నాయి.

అన్నారం గ్రామం లో ఏకంగా 38 దొంగతనాలు జరిగాయి ఇటువంటి తరుణంలో మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు ఎదురుగా ప్రామిక పాఠశాల లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి, పాఠశాల రూములో తాళం పగలకొట్టి, బీరువాలో ఉన్న, రికార్డులను చిందర వం దనం చేసిన సంఘటన మరువక ముందే, గురువారం రాత్రి పక్కనే ఉన్న అంగన్వాడి సెంటర్లో తాళం పగలగొట్టి. ఏకంగా రెండు ట్రేల పిల్లల గుడ్లు పట్టుకెళ్ళగా, స్టవ్ పై అన్నం వండుకున్నట్లుగా గమనించబడింది.

అంగన్వాడి టీచర్లు శుక్రవారం ఉదయం పాఠశాలకు రాగానే తాళం పగలగొట్టి ఉండ గా, కంగుతిన్నారు. లోపటికి వెళ్లి పరిశీలించగా పిల్లలకు ప్రతిరోజు ఉడికించి ఇచ్చే గు డ్లు పట్టుకు వెళ్ళినట్లు తెలుస్తుంది. మండల కేంద్రంలో ప్రతిరోజు ఏదో ఒక దొంగతనం జరుగుతుండగా, ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. జరిగిన సంఘటనపై ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీజను విచారణ కోరగా , జరిగిన సంఘటన వాస్తవమేనని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.