calender_icon.png 4 August, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలు నీ పాలన చూసి సిగ్గుపడుతున్నారు

05-12-2024 11:28:38 PM

హరిష్‌రావును అరెస్ట్ అప్రజాస్వామికం

మీడియాతో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు

మహబూబాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి  తెలంగాణ ప్రజలు నీ పాలన చూసి సిగ్గుపడుతున్నారని, హరిష్‌రావు అరెస్ట్ అప్రజాస్వామికం అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ రాష్ట్రన్ని ఆ్ంరథ్ర ప్రజలకు అముతావా అని ఘాటూగా విమర్శించారు. తెలంగాణ చరిత్ర ను నువ్వు మార్చలేవు చరిత్రలో నీ లాంటి పాలకులు ఎందరో మటిటకరిచారని అన్నారు. హరిష్‌రావును అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. తెలంగాణ ప్రజలు నీ పాలన చూసి సిగ్గుపడుతున్నారని, రుణమాఫి మొత్తం చేయకుండా రైతులను మోసం చేసిన గొప్ప పాలకుడవు నువు అని అన్నారు. పనికిమాలిన ముఖ్యమంత్రి వద్దు అని కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు చేస్తున్నారని అన్నారు. అరెస్టు చేసిన బీ ఆర్ ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని లేదంటే రాష్ట్రము అగ్ని గుండం మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.