calender_icon.png 24 May, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెం పార్టీలో దొంగలు పడ్డారు

24-05-2025 12:00:00 AM

విలేకరుల సమావేశంలో జెబి శౌరి ఘాటు వ్యాఖ్యలు

కొత్తగూడెం మే 23 (విజయక్రాంతి)ః నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భావజాలాని కి సంబంధంలేని వ్యక్తులు కొంత మంది దొంగల మాదిరిగా  చేరి, చెదల మాదిరిగా ఒక రాజకీయ పార్టీకి  కోవర్టుగా మారీ బ్ర ష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని టీ పిసిసి సభ్యులు, కొత్తగూడెం నియోజకవర్గ కన్వీనర్ జేబీ శౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కు మార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదేం వీరయ్య కొత్తగూడెంలో సమావేశం ఏర్పాటు చేస్తే, కొద్దిమంది సంబంధం లేని వ్యక్తులు  రసా,బసా సృష్టించాలనే దురుద్దేశంతో గొడవలు సృష్టించారని మండిపడ్డా రు.

అత్యున్నత స్థాయిలో ఉన్న పార్టీ నాయకత్వాన్ని దుయ్యబట్టారని క్రమశిక్షణ లేకుం డా పార్టీ పరువు తీసే ప్రయత్నం చేశారని  ఆ రోపించారు. ఈ విషయం అధిష్టానం దృష్టి కి వెళ్లిందని, టిపిసిసి బాధ్యుడుగా వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు  పార్టీలో అలజడి సృష్టించిన వారిని ఉపేక్షించేది లేదని వెంటనే కఠిన చర్యలు తీ సుకుంటానని హెచ్చరించారు.

పూటకో పార్టీ మారేవారు,ఇప్పటికే నాలుగు పార్టీలు మారి న వ్యక్తి అనుచరులు, అధికారం ఎక్కడ ఉం టే అక్కడ ఉండే బినామీ కాంట్రాక్టర్లు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికారం ఉన్నా లేకున్నా జెండా మోస్తూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా, పార్టీలో ఉంటూ వస్తున్న వారిని అధికారం కోసం ఆప్పటికప్పుడు వ చ్చిన వారు అవమానిస్తే చూస్తూ ఊరుకునే ది లేదని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్న పేదవారి పక్షాన నిలుస్తుందని,తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభి వృద్ధి సంక్షేమ పథకాలు విసృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళి రానున్న, స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధిస్తామని ధీ మా వ్యక్తం చేశారు.

ఏ పార్టీతో పొత్తు లేకుం డా ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో  ఎన్.ఎస్. యు.ఐ జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నా యక్,బిక్షపతి,తెలకపల్లి లక్ష్మయ్య మైనార్టీ నా యకులు దావుద్,ఎస్సీ సెల్ నాయకులు ఎలకపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.