23-05-2025 11:59:14 PM
తొగుట సిఐ లతీఫ్
దౌల్తాబాద్,(విజయక్రాంతి): మత్తు పదార్థాలు విక్రయించిన, రవాణా చేసిన చర్యలు తప్పవని తొగుట సీఐ లతీఫ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో పాన్ షాప్, కిరాణం షాప్ తదితర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మిన, విక్రయించిన వెంటనే 100,1908, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీరాం ప్రేమ్ దీప్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.