calender_icon.png 17 December, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా కొనసాగుతున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

17-12-2025 03:47:15 PM

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంబిరావుపేట, ముస్తాబద్ మండలాలలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు,సిబ్బందికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల భద్రత పరమైన పలు సూచనలు చేశారు.

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెట్రోలింగ్ వాహనాలు,ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.