17-12-2025 03:45:02 PM
ఎఎస్పి చిత్తరంజన్
రెబ్బెన ,ఆసిఫాబాద్ మండలాల్లోని పోలి కేంద్రాల సందర్శన
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెబ్బెన మండలం గోలేటి, ఆసిఫాబాద్ మండలం రాజంపేట, బాబాపూర్ గ్రామలలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ బుధవారం సందర్శించారు. 163 BNSS అమలులో ఉన్నందున, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు ఓటర్లు తప్ప ఇతరులెవరూ రాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు, బ్యాలెట్ బాక్సుల తరలింపు సమయంలో, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు.