15-05-2025 01:36:58 AM
హెచ్‌ఎం డబ్ల్యూ ఎస్ నుంచి అరకొరగా సరఫరా
ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టని అధికారులు
మేడ్చల్, మే 14(విజయ క్రాంతి): మేడ్చ ల్ పట్టణంలో ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఒకవైపు మిషన్ భగీరథ నీరు సక్ర మంగా రాకపోవడం, మరోవైపు ఇళ్లలో బో ర్లు ఎండిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి రాకముందే నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఈసారి ఇ లాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం కూ డా దీని మీద దృష్టి పెట్టలేదు.
నిధులు కేటాయించలేదు. మేడ్చల్ పట్టణానికి ప్రతిరోజు 6.5 ఎం ఎల్ డి నీరు అవసరం కాగా, మొ న్నటి వరకు ఘనపూర్ హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ నుంచి 4 ఏం ఎల్ డి మాత్ర మే వచ్చింది. మంగళవారం అసలే రాలేదు. పట్టణంలో కె ఎల్ ఆర్ 1,2 కాలనీలు, బా లాజీ నగర్, రాఘవేంద్ర నగర్ తదితర ప్రాం తాలకు ఆరు రోజులుగా నీరు రావడం లేదు.
దీంతో వీరు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోం ది. బస్తీలలోనూ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా రు. మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నా య చర్యలు తీసుకోవడం లేదు. పాలకవ ర్గం ఉన్న సమయంలో ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు.
ప్ర స్తుతం ప్రజా ప్రతినిధులు లేరు. స్పెషల్ ఆఫీసర్ ఇటువైపు రావడం లేదు. మున్సిపాలి టీలో కేవలం నాలుగు ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. పట్టణంలో బస్తీలు బాగా ఉన్నందున నాలుగు ట్యాంకర్ సరిపోవడం లేదు. మరో రెండు నెల లు ఎలా గడుస్తుందోనని ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎండిపోతున్న బోర్లు
ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురువనందున భూగర్భ జలాలు పెరగలేదు. దీంతో ఇళ్లలోని బోర్లు ఎండిపోతున్నాయి. బాగా నీరు వచ్చే బోరు ఒక్కసారిగా ఎండిపోతోం ది. మళ్లీ బోర్ వేసిన నీరు రావడం లేదు. కొన్నిచోట్ల కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి బోరు వేస్తే నీరు రాక ఇంటి నిర్మాణం ఆపేశారు. వేయి అడుగులు వేసిన చుక్క నీరు రావడం లేదు.
పట్టణంలో ప్రతి ఇంటిలో మూడు నాలుగు కుటుంబాలు అద్దెకు ఉం టున్నాయి. గత్యంతరం లేక టాంకర్ కు ఆరు, ఏడు వందలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ల ధర పెంచేశారు. ప్రైవేటు ట్యాంకర్లు ప్రతిరోజు వందల ట్రిప్పులు చేస్తున్నాయి. మున్సిపల్ నీరు రానందున ట్యాంకర్ ల నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది.
ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నాం
బస్తీలలో మున్సిపల్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నాం. నాలుగు ట్యాంకర్ లు 30 ట్రిప్పులు చేస్తున్నాయి. ఒక్కో ట్యాం కర్ రోజుకు 7, 8 ట్రిప్పులు చేస్తోంది. అవసరాన్ని బట్టి ప్రైవేటు ట్యాంకర్లు ఎంగేజ్ చేస్తు న్నాం. ఘనపూర్ నుంచి తక్కువగా నీరు వస్తోంది. మున్సిపల్ ట్యాంకర్లతో డ్రమ్ములు మాత్రమే నింపుతాం. సంపులు నింపలేము.
బి.నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, మేడ్చల్