10-07-2025 01:14:25 AM
ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రాఘవ్ ఓంకార్ శశిధర్ ద ర్శకత్వం వహించారు. కెఆర్‌ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూ రి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్లలోకి రా నుం ది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమాకు ‘ది 100’ టైటిల్ పెట్టడానికి కారణం?
ఒక సినిమాలాగే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాను. ‘ది 100’ అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది. సొసైటీకి ఏదైనా మంచి చేయాలి అనే తపనతో పెట్టిన టైటిల్ ఇది. లక్కీగా కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా కుదిరింది.
ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయు గంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఈ సిని మాకి అంత పవర్ ఉంది. వెరీ టచింగ్ పా యింట్. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా గురించి చాలా ఎమోషనల్ అయ్యారు కదా.. మీకు ఎలా అనిపించింది?
ఆయన ఈవెంట్ కి ఒక గెస్ట్ గా వచ్చి మా పుటేజ్ చూసి చాలా అద్భుతంగా ఫీలయ్యా రు. ఆయనకి కంటెంట్ చెప్పాను. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే చాలా అద్భుతమైన సందేశం ఉన్న సినిమా ఇది. అందుకే ఈ సిని మా గురించి ప్రముఖులకి చెప్పడం జరిగింది.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఇప్పటివరకు చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి కానీ ఇందులో క్యారెక్టర్ మాత్రం ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే ఈ విషయం చెప్తారు.
మొగలిరేకులు సీరియల్‌లో ఆర్‌కే నాయుడు క్యారెక్టర్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది కదా.. మళ్ళీ అలాంటి క్యారెక్టర్ తో సినిమా ఎందుకు చేయలేదు?
దాదాపు ఆరు సంవత్సరాలు నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్ లోనే ఉన్నాను. సినిమాల్లో చేసినప్పుడు ఆ క్యారెక్టర్ కి భిన్నమైన క్యారెక్టర్స్ ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఆలోచనతో మాన్ అఫ్ ది మ్యా, సిద్ధార్థ, సాది ముబారక్ లాంటి సినిమాలు చేశాను. ఆడియన్స్ మళ్ళీ ఒక పోలీస్ క్యారెక్టర్ ని కోరుకున్నారు. అలా పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే మళ్ళీ ఒక బలమైన కథ కుదరాలి. అలాంటి కథ 100లో కుదిరింది. ఈ క్యారెక్టర్ ఆర్కే నాయుడు కంటే అథెంటిక్ గా ఉంటుంది.
ఈ కథ ఎలా పుట్టింది?
ఇది ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచన. సినిమాగా తీసుకోవచ్చా అని అడిగాను. పేరు పెట్టకుండా తీసుకోవచ్చు అని చె ప్పారు. దాదాపు ఆలోచనని నాలుగు సంవత్సరాలు పాటు నా బుర్రలో మోసాను. ఒక సారి సుకుమార్ గారి దగ్గరికి లం కి వెళ్ళాను. కథల గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఈ కథ చెప్పాను. ఆయన చాలా ఎక్సుటై అయ్యా రు. ముందు ఇలాంటి కథ చేయాలని చెప్పా రు.
వాళ్ళ టీంతో కొన్ని రోజులు జర్నీ జరిగింది. తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యారు. ఈ కథ చేసుకుంటానని ఆయనకు చెప్పాను. తర్వాత కథను పూర్తిస్థాయిలో సిద్ధం చేశాం. 100 శాతం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లాం.
మీకేమైనా డ్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నాయా?
నాకు ఇష్టమైన సినిమా నాయకుడు. ఎన్నోసార్లు ఆ సినిమాని చూశాను. అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది.
మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్..?
నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ వర్క్ ఇవ్వ డం ఇష్టం. ఆడియన్స్ నాకు చాలా ప్రేమ ఇ చ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ లాగా చూసుకున్నారు. వాళ్ళకు క్వాలిటీ కంటెంట్నే ఇవ్వాలి. అందుకే చాలా మంచి కథలతోనే సినిమాలు చేయాలని ఉంది. నా నెక్స్ట్ ప్రాజెక్టు కి ఇంత గ్యాప్ ఉండదు. అది తొందరలోనే వస్తుంది. అలాగే ది 100 సినిమాకు సీక్వెల్ చేసే ఛాన్స్ కూడా ఉంది.