calender_icon.png 11 July, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.వాల్య

10-07-2025 05:42:24 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి మెడికల్ కళాశాల(Medical College) ప్రిన్సిపాల్​గా డా.వాల్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రొఫెసర్లు, వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల సిబ్బందితో సమావేశమై ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మెడికల్ కళాశాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, భవన నిర్మాణ పనులు త్వరగా చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.