10-07-2025 06:02:34 PM
హైదరాబాద్: జహీరాబాద్ లోని నిమ్జ్(National Investment and Manufacturing Zone) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ బాధితుడు తన భూసేకరణ పరిహారం చెక్కులు ఇవ్వాలని నిమ్జ్ కార్యాలయం అధికారులను కలిశాడు. భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు వారు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారుల ముందస్తు పతకం ప్రకారంగా బాధితుడు నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్ లకు రూ.65 వేలు లంచం ఇస్తున్న క్రమంలోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిమ్జ్ కార్యాలయ ప్రధాని అధికారి డ్రైవర్ వద్ద నగదు లభించడంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ లంచాలు తీసుకునే వారిపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటుంది. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వారిపై నిఘా పెట్టి ఆధారాలతో సహా వారిని అరెస్టు చేస్తోంది. ఎవరైనా అధికారులు లంచం తీసుకుంటూ దొరికితే అంతే సంగతులు. వారికి సంబంధించిన డేటాను మొత్తం తీసి వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. లంచాలు తీసుకున్న అధికారుల ఆదాయం ఎంత..?, ఆదాయానికి మించి ఎన్ని ఆస్తులు ఉన్నాయని తెలిసుకొని కేసు నమోదు చేస్తున్నారు. లంచాలు తీసుకున్న అధికారులు తస్మా జాగ్రత్త.