10-07-2025 05:46:18 PM
కామారెడ్డి (విజయక్రాంతి): జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకటేశ్వర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇన్ఛార్జీగా పనిచేసిన డాక్టర్ ఫరీదా బేగం నూతన సూపరింటెండెంట్‌గా వచ్చిన డాక్టర్ వెంకటేశ్వర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సూపరింటెండెంట్ కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపరిండెంట్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.