calender_icon.png 10 July, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురు పౌర్ణమి సందర్బంగా గురువులకు సత్కారం

10-07-2025 06:01:19 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం రేకుర్తి 18వ డివిజన్లో బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి(Convener Jadi Bal Reddy) ఆధ్వర్యంలో రేకుర్తి ప్రాథమిక పాఠశాలలో గురు పౌర్ణమి సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులకు శాలువ కప్పి సత్కరించి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.  జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ... గురువులను గౌరవించాలని, విద్యార్థి దశ తల్లిదండ్రుల వద్ద ఉన్న సమయం కన్నా ఉపాధ్యాయుల వద్ద విద్యార్థులు ఎక్కువ సమయాన్ని గడుపుతారు కావున విద్యార్థులు గురువు చెప్పినవి శ్రద్ధగా విని ఉన్నతమైన చదువులు చదవాలని కోరారు. గురువే ప్రత్యక్ష దైవం, ఒక వ్యక్తి ప్రయోజకుడు అయిన ఒక మంచి డాక్టర్ అయిన దానికి కారణం గురువు అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోదారి నరేష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ పొన్నాల రాములు భూత్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి నాంపల్లి శంకర్ విష్ణు ప్రసాద్ రావు, వినీత్ మరియు రాకేష్  పాల్గొన్నారు.