calender_icon.png 11 July, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుపౌర్ణమి వేళ.. గురువులకీ సన్మానం

10-07-2025 06:15:47 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో గురు పౌర్ణమినీ పురస్కరించుకొని బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి(BJP President Dara Kalyani) ఆధ్వర్యంలో గురువులకీ సన్మానం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా యోగా గురుజి రెవెల్లి రాజలింగు, శిశు మందిర్ స్కూల్ ప్రధాన ఆచార్యులు ఇంగు భాగ్యలక్ష్మి, నృత్య కళ హనుమన్ల మధుకర్, కూచిపూడి నాట్య కళాకారులు అల్లాడి అర్చనను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా గురు స్థానంలో ఉండి అన్ని రంగాలలో విద్యాబుద్ధులు అందిస్తున్న గురువును సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోయల ఎమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పట్టి వెంకట కృష్ణ, దుర్గం అశోక్, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, సీనియర్ నాయకులు పానుగంటి మధు, జిల్లా కార్యదర్శి కోయల్కర్ గోవర్ధన్,జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, సీనియర్ నాయకులు జిదుల రాములు, వేల్పుల రాజయ్య, గంపల చంద్రమౌళి, పట్టణ కార్యదర్శి గుడిసెల రాజశేఖర్, రాజేశ్వరి, తోటపల్లి ఓం సాయి, నాయకులు పాల్గొన్నారు.