10-07-2025 06:26:30 PM
మహాదేవపూర్ (భూపాలపల్లి) (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం(Shree Kaleshwara Mukteswara Swamy Devasthanam) ప్రధాన అర్చకులుగా గురువారం శ్రీ ఆరుట్ల రామాచారి నియమించినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి మహేష్ తెలిపారు. శ్రీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హైదరాబాద్ ఉత్తర్వుల ప్రకారం శ్రీ ఆరుట్ల రామాచారి అర్చకులకు పదోన్నతి కల్పించి ఆలయ ప్రధాన అర్చకులుగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు ఉప ప్రధాన అర్చకులు నగేష్ శర్మ, ఆలయ సూపరిండెంట్ బుర్రి మహేష్ ఉన్నారు.