calender_icon.png 11 July, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా మహిళా శక్తి సంబరాలపై 'తెలంగాణ సాంస్కృతిక సారధుల'చే అవగాహన

10-07-2025 05:49:23 PM

పెన్ పహాడ్: మండల కేంద్రంతో పాటు మాచారం గ్రామాలలో ఇందిరా మహిళా శక్తి సంబరాలపై సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా కళాబృందంచే గ్రామీణ మహిళలకు సాధికారతపై ఆట పాటల ద్వారా అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా ఏపీఎం అజయ్ నాయక్, కళాబృందం సభ్యులు పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 47 లక్షల మంది గ్రామీణ మహిళలు 4.4 లక్షల SHG సభ్యత్వాలు అందించి సాధికారిత దిశగా ప్రభుత్వం ఆదుకున్నట్లు వారు పేర్కొన్నారు. 

వేలాది మంది వికలాంగ స్వయం సహాయక సంఘాలు, అలాగే 18 వేల మంది వృద్ధ స్వయం సహాయక సంఘాలకు వేల కోట్లు ఆర్థిక రుణాలు అందించినట్లు తెలిపారు. 29,680 మహిళా టైలర్లకు 37.58 లక్షల స్కూల్ యూనిఫామ్స్ అందించి స్టిచ్చింగ్ కోసం రూ.28.09 కోట్ల ఆదాయ వనరులుగా కల్పించినట్లు అన్నారు. ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా కళాబృందం ద్వారా మహిళాలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు. గడ్డం ఉదయ్, డప్పు శంకర్, పాక ఉపేందర్, మద్దిరాల మంజుల, సిరిపంగి రాధ, సంఘ బంధాల అధ్యక్షులు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.