10-07-2025 05:44:18 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ సుభానంద దేవి, శ్రీ సరస్వతి దేవి అమ్మవార్లకు ఆషాడ మాసం శుభ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ రకాలైన కూరగాయలతో శాకాంబరి అలంకరణ చేశారు. ఆషాడ మాసం గురు పౌర్ణమి సందర్భంగా శుభానంద్ దేవి, శ్రీ సరస్వతి దేవి, అమ్మవార్లకు వివిధ రకాలైన కూరగాయలతో అలంకరించడం జరిగిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు,అర్చకులు ఆలయ సిబ్బంది, భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.