01-05-2025 01:55:01 AM
మంత్రి కొండా సురేఖ
హైదారాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): సామాజిక దృక్పథం కలిగిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడితోనే కేంద్ర క్యాబినెట్ కులగణనకు అంగీకరించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమన్నారు.
కులగణన రాహుల్ గాంధీ ఆశయ మని, ప్రభుత్వ పెద్దల కృషి అని తెలిపారు. కేంద్ర నిర్ణయం సంతోషకరమని, భారత్ జోడో యాత్రలో సామాజిక అసమానతలు, కుల రుగ్మతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు. తెలంగాణలో చేపట్టిన కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసినట్టు వెల్లడించారు.