calender_icon.png 1 May, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?

01-05-2025 01:56:32 AM

ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): 48 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుం డా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ముసలికన్నీరు కారుస్తుందన్నారు. అణగారిన వర్గాల కు చాంపియన్ అని చెప్పి బీసీ,ఎస్సీ, ఎస్టీల ఓట్లు కొల్లగొట్టారని విమర్శించారు.

బీజేపీ 2014లో ఒక ఓబీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసిందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 5 మంది మైనారిటీలకు స్థానం కల్పించిటన్లు తెలిపారు. 60 శాతం మంది ఓబీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లు చెప్పారు. కులగణనతో రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగాల పర ంగా ఓబీసీలకు అవకాశాలు పెరుగుతాయన్నారు.