calender_icon.png 21 May, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బికినీ వేసుకోవడం ఇదే తొలిసారి

21-05-2025 12:49:21 AM

బాలీవుడ్ భామ కియారా అద్వానీ టాలీవుడ్‌కు సుపరిచితురాలే. ఈ బాలీవుడ్ అందం తాజాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్2’ టీజర్‌లో బికినీతో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ అందాల ఆరబోత ఎక్కువగానే ఉండనుందని చెప్పకనే చెప్పినట్టయ్యింది.

ఈ సినిమాలో కియారా.. హృతిక్‌కు జంటగా, రా ఏజెంట్‌గా కనిపించనుందని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న కియారా ప్రస్తుతం ప్రగ్నెంట్. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తిచేసిన కియారా.. తను ప్రగ్నెంట్‌గా ఉన్న ఈ టైమ్ లో బికినీ షాట్స్ రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ‘వార్2’ టీజర్ గురించి కియారా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

టీజర్ షేర్ చేస్తూ.. ఈ సినిమాలో చాలా ఫస్ట్‌లు ఉన్నాయని పేర్కొంది. ‘ఫస్ట్ వైఆర్‌ఎఫ్ ఫిలిం, ఫస్ట్ యాక్షన్ ఫిలిం, ఈ ఇద్దరు హీరోలతో నటించడం ఫస్ట్ టైమ్, డైరెక్టర్ అయాన్‌తో ఫస్ట్ టైనమ్ కలిసి పనిచేస్తున్నా. అలాగే బికినీ వేసుకోవడం కూడా సినిమా కోసమే ఫస్ట్ టైమ్. ఇదిగో నా ఫస్ట్ బికినీ షాట్ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.