calender_icon.png 17 October, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరకానికి బోర్డు.. ఈ రోడ్డు!

17-10-2025 12:04:19 AM

-ప్రయాణం నరకం.. నిత్యం రక్తసిక్తం 

-నామరూపాలు కోల్పోయిన బిటిపిఎస్ ప్రధాన రహదారి 

-గోతులు, మొనదేలిన రాళ్లతో మరింత అధ్వానం

-అధికారుల నిర్లక్ష్యం,  ప్రజాప్రతినిధుల అలసత్వం

-నరకం చూస్తున్న ప్రయాణికులు

-అడుగు అడుగున  గుంతలమయం..

మణుగూరు, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : గత వారంలో సుదీర్ఘంగా కురిసిన వర్షాలకు మణుగూరు, భద్రాద్రి పవర్ ప్లాంట్  రహదారి మృత్యు మార్గంగా మారింది. బిటిపిఎస్ బొగ్గు రవాణా చేసే టిప్పర్లు మితిమీరిన వేగంతో వస్తుండడంతో  ద్విచక్ర వాహన, ఆటో చోదకులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు పలు చోట్ల రహదారిపై  పడిన గుంతల్లో నీరు, బురద చేరి చెరువులను తలపిస్తున్నాయి. మణుగూరు సీఎస్పీ ఇసుక బంకర్ నుంచి బయ్యారం క్రాస్ రోడ్డు వరకు  ప్రధాన రహదారి చాలా వరకు ఛిద్రమైంది. దీంతో వాహనాల రాకపోకలు సాగించడం కష్ట తరమవుతోంది. రామానుజారం, విజయనగరం, చుక్కుడుగుంట ప్రాంతాల్లో పడ్డ గోతులు పొంచి ఉన్న ప్రమాదాలకు నిలువుటద్దంగా దర్శనమిస్తున్నాయి.

నిత్యం బీటీపీఎస్కు బొగ్గు లారీలు, మణుగూరు నుంచి పినపాక మండలాలకు ఆటోలు, వేలాది సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లు, బస్ లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ఈ ప్రధాన రహదారిపై జరుగుతుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో నెలకొంది. గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణించడం నరకంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వాహనదారులు జారిపడి గాయాలపాలవుతున్నారు. ఆర్ టి సి బస్సులు, లారీలు, ఆటోలు ఈ రోడ్డు లో ప్రయాణంచేయడంతో ఊయాల, జంపాల అనే సామెత గుర్తుకొస్తుంది. ప్రయాణికుల ఇబ్బందులపై విజయక్రాంతి కథనం..

ప్రయాణం నరకం.. నిత్యం రక్తసిక్తం

బీటీపీఎస్ నుంచి మణుగూరుకి వెళ్లే 12 కిలోమీటర్ల రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతలతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు లారీల దుమ్ము, మరోవైపు పెద్ద పెద్ద గుంతలతో వాహన దారుల పరిస్థితి వర్ణనా తీతంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా రహదారి అడుగ డుగునా గుంతలు పడి మరి దారుణంగా మారిపోయింది. ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలంటే ప్రయాణీకులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది.

రోడ్డంతా గుంతలతో  దర్శనమిస్తోంది. ఒకవైపు వాయు కాలుష్యం మరోవైపు వాహన రాకపోకలతో లేస్తున్న దుమ్ముతో ప్రజలు ఉక్కురిబిక్కి రవుతున్నారు. రహదారికి రువైపులా ఉన్న ప్రజలు, వ్యాపారులు దుమ్ము, వాహన కాలుష్యంతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. అడుగడుగునా  గోతులు, మొనదేలిన రాళ్లతో మరింత రహదారి అధ్వానం మారింది. మణుగూరు నుండి బిటిపిఎస్ వరకు రహదారి పూర్తిగా  గుంతలమయమై నరకానికి నకళ్లుగా మారు తుంది. రహదారిపై  ప్రయణం చేయాలంటే నరకం కనిపిస్తోందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అడుగడున పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో నడుములు విరుగుతున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు.

బాగు చేయండి మహాప్రభో..

రహదారి గోతులమయంగా ఉందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. దుమ్ము ధూళితో నిండి ఉండడం వల్ల రహదారి పై వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ రూట్లో ప్రయాణాలు చేయాలంటే వామ్మో అంటున్నారు. బిటిపిఎస్ కి వెళ్లే బొగ్గు లారీలు అతి వేగంతో వెళ్తూ వాహ నదారులు ప్రమాదాలకు గురవు తున్నారు. ప్రయాణాలు చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని పలువురు వాహనదారులు ఆగ్రహస్తున్నారు. ఈ రహదారిలో ప్రయాణించే వారు అతి జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

మరోవైపు వాహనదారులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ రోజు రోడ్డుఫై అభివృద్ధి పనులను చేసిన దాఖలాలు లేవని ప్రజలు ప్రభుత్వ పనితీరు మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రధానంగా ఈ రోడ్డు మార్గం గుండా రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే గుంత ల్లో పడి దవాఖానల పాలు కావాల్సిన దుస్థితి నెలకొంటుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి గుంతల మయంగా మారిన  రోడ్డుకు మర మ్మతులు చేయాలని  మండల ప్రజలు కోరుతున్నారు.