calender_icon.png 8 October, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి దృష్టి హైకోర్టుపైనే

08-10-2025 01:27:28 AM

నేడు బీసీ రిజర్వేషన్లపై విచారణ

  1. బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం నిర్ణయం  
  2. మంత్రులు, పార్టీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం  
  3. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో 9కి వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన రెడ్డి జాగృతి

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : బీసీలకు స్థానిక సంస్థల ఎన్ని కల్లో 42 శాతం రిజర్వేషన్లపై బుధవా రం హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపైన ఉత్కంఠ నెలకొన్నది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 9కి వ్యతిరేకంగా రెడ్డి జాగృతి నేత లు కోర్టుకు వెళ్లడంతో.. ప్రభుత్వం, కాం గ్రెస్ పార్టీ కూడా ఛాలెంజ్‌గానే తీసుకున్నాయి. రిజర్వేషన్లు సాధించుకునేం దుకు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను ప్రభుత్వం నియమించింది.

అయితే హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయవర్గాలు, ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు బుధవారం  తెరపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణ యంతో ఉంది. బీసీ బిల్లును చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ప్రభుత్వం.. ఏ మాత్రం నిరక్ష్యం జరగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. 

హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి దశలోనూ బీసీ హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి శక్తిని ఉపయోగిస్తోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై  సీనియర్ న్యాయవాదులను నియమించిన ప్రభుత్వం ఆ జీవోను కొట్టి వేసేవిధంగా వాదనలు వినపించారు. ఇక బుధవారం హైకోర్టులో విచారణ ఉండటంతో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత అప్రమత్తంగా వ్యవ హరిస్తున్నారు.

హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి.. బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివా సంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీ సీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,  పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశం నిర్వహించారు. బుధవారం హైకోర్టులో జరగనున్న విచారణలో బలమై న వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి సీనియర్ అడ్వకేట్ అభిషే క్ సింఘ్వీని కోరారు. ఇదిలా ఉండగా, బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా పార్టీ నేతలు, వివిధ బీసీ సంఘాల నాయకులు ఇంప్లీడ్ అయ్యారు. 

మంత్రి శ్రీహరి నివాసంలో... 

రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అధికారికి నివాసంలో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు సమావేశమయ్యారు. బుధవారం హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై వాదనలు ఉండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వం నుంచి బలమైన వాదనలు వినిపించాలని సమావేశంలో మాట్లాడుకు న్నారు.ఈ భేటీలో పీసీసీ చీఫ్ మహే ష్, మంత్రులు పొన్నం, సురేఖ, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శంకర్, రాజ్‌ఠాకూర్, మేయర్ విజయలక్ష్మితో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు ఇందిరాశోభ న్, చరణ్‌కౌశిక్ పాల్గొన్నారు.