calender_icon.png 8 October, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒప్పందంతో ఎన్నికల బరిలోకి

08-10-2025 12:44:57 AM

  1. బీహార్‌లో సీట్ల పంపంకంపై ఎన్డీఏలో చర్చలు
  2.   205 సీట్లను చెరిసగం పంచుకోనున్న బీజేపీ, జేడీయూ
  3. మిగిలిన 38 సీట్లు ఎన్డీఏలో భాగస్వాములైన చిన్న పార్టీలకు
  4. కొనసాగుతున్న చర్చలు

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువ డతాయి. అయితే 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలోని జేడీయూ అధికారంలో ఉన్నది. జేడీ యూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, జేడీయూ సమాన సంఖ్యలో సీట్లను పంచుకుని, పోటీ చేయనున్నట్టు సమాచారం.

మొత్తం 243 స్థానాల్లో 205 సీట్లను రాష్ట్రంలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న బీజేపీ, జేడీయూ సమానం గా పంచుకోనున్నట్టు తెలుస్తున్నది. మిగిలిన 38 సీట్లను ఎన్డీఏలో భాగస్వాములైన చిన్న పార్టీలు- లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ), హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎం) లకు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఎల్‌జేపీకి 25 స్థానాలు, హెచ్‌ఏఎంకు ఏడు, ఆర్‌ఎల్‌ఎంకు ఆరు స్థానాలు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం.

సీట్ల పంపకాలపై ఆయా పార్టీల అధినేతలు చిరాగ్ పాశ్వాన్(ఎల్‌జేపీ), జితన్ రామ్ మాంఝీ(హెచ్ ఏఎం), ఉపేంద్ర కుష్వాహా(ఆర్‌ఎల్‌ఎం)లతో తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ పార్టీలకు తక్కువ సీట్లు ఇచ్చినా.. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కువ అవకాశం ఇస్తామని బీజేపీ వారికి భరోసా ఇస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా బీహార్‌లో ప్రతిపక్షాలైన ఆర్జెడి, కాం గ్రెస్, వామపక్ష పార్టీలు మహా కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగనున్నారు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీహార్‌లోని 243 స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. 

7.4 కోట్లకు పైగా ఓటర్లు

బీహార్‌లో 7.4కోట్లకు పైగా ఓటర్లు ఉన్నా రు. దాదాపు 14లక్షల మంది తొలిసారి ఓటేయనున్నారు. 33శాతం మంది అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ) ఓటర్లు ఉ న్నారు. వీరు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఎన్డీఏపై వ్యతిరేకత, బలమైన ప్రతిపక్షం, పెరిగిన మహిళా ఓటర్లు ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి.