calender_icon.png 5 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రైవేట్ ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి

05-09-2025 06:52:28 PM

హూజూర్‌నగర్: ప్రైవేట్ ఉపాధ్యాయుల సేవలు వెలకట్ట లేనివి అని ప్రైవేట్ టీచర్ల సమస్య ల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు యాదవ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ప్రైవేట్ టీచర్స్ ను ఘనంగా సన్మానించి మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన ప్రైవేట్ టీచర్ల సేవలు వెలకట్టలేనివన్నారు. సమాజానికి వెలుగునిచ్చే గురువులను గుర్తించి సత్కరించుకోవడం మన బాధ్యత అని అన్నారు.

ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు టీపిటీఏ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ అధికారులతో చర్చించి  ప్రెవేట్ ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు, ఆర్థిక సహాయం అందేలా పోరాడతామని ఆయన తెలిపారు.పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమను గుర్తించి గౌరవించినందుకు టీపీటీఏ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేటి కార్యక్రమం ప్రైవేట్ టీచర్లందరిలో స్ఫూర్తి నింపిందని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరణ లభించిందని అన్నారు.