13-05-2025 12:58:30 AM
న్యూఢిల్లీ, మే 12: భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని రెండు రోజుల క్రితం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మరోసారి కీలకవ్యాఖ్యలు చేశా రు. భారత్-పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే వాణిజ్యం నిలిపేస్తానని.. హెచ్చరిం చానని.. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తెలిపారు.
వాణిజ్యం అనే అస్త్రాన్ని తాను వాడిన ట్టు మరెవరూ వాడలేదన్నారు. ‘భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందా నికి మా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది. తద్వారా రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రమాదకర ఘర్షణకు తెరపడింది. ఈ రెండు దేశాల నాయకత్వం ధృఢంగా, శక్తివంతంగా ఉంది. వారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు.
ఉద్రిక్తతలకు ముగింపు పలికి తేనే వాణిజ్యంలో మీతో ముందుడు గు వేస్తాం. లేకపోతే ఎలాంటి వాణి జ్యం చేయబోమని హెచ్చరించా. ఇన్ని రోజులు వాణిజ్యం విషయంలో అం డగా ఉన్నాం. భవిష్యత్‌లో భారత్ వాణిజ్య సంబంధాలు బలో పేతం చేసుకోనున్నాం. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు నా టీం బాగా పనిచేసింది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ రెండు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృ షి చేస్తానని ట్రంప్ వెల్లడించిన విష యం తెలిసిందే. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నపుడు కూడా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నాలు చేశారు. వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంధాన్ని అంగీకరించాయన్న ట్రంప్ వాదనను భారత వర్గాలు ఖండించాయి.