calender_icon.png 16 November, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

16-11-2025 08:04:00 PM

రేగొండ (విజయక్రాంతి): కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గణపురం సీఐ కరుణాకర్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం కొత్త పల్లి గోరి ఎస్సై ఎస్.దివ్య ఆధ్వర్యంలో గాంధీనగర్ కెనాల్ దగ్గర గంజాయి విక్రయిస్తున్న బీహార్‌ కు చెందిన చోటు కుమార్(20), కుందన్ కుమార్(20) సంతోష్ కుమార్(18) లను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 2.3 కిలోల గంజాయి, 53 గంజాయి చాక్లెట్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేశారు. బీహార్ నుంచి చవకగా తెప్పించి స్థానికంగా అధిక ధరకు అమ్ముతున్నట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ముగ్గురిపై ఎండిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌ కు పంపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గోరి మండల రెండో ఎస్సై షాఖాన్ ,సిబ్బంది పాల్గొన్నారు.