calender_icon.png 16 November, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవారంగంలో తుంగతుర్తి లయన్స్ క్లబ్ ముందంజ

16-11-2025 08:16:26 PM

కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, కేతిరెడ్డి పద్మా రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

తుంగతుర్తి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా సేవలందించడంలో లయన్స్ క్లబ్‌ ముందు వరుసలో ఉందని లయన్స్ క్లబ్ సభ్యులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, కేతిరెడ్డి పద్మా రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో సూర్యాపేట, తుంగతుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో క్లబ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఉదయం ప్రారంభమైన శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్యులు పాల్గొని సుమారు 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.

ముత్యబిందు, దూరదర్శనం, సమీప దృష్టి సమస్యలు, కంటి ఒత్తిడి వంటి పలు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు సకాలంలో చేయించుకోవడం చాలా ముఖ్యమన్నారు. ముఖ్యంగా కంటి సమస్యలు ముందుగా గుర్తిస్తే పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సేవలు పొందారు. భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు క్లబ్ సభ్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి లయన్స్ క్లబ్ సభ్యులు కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు నిమ్మల వేణు, యాదగిరి, ఓరుగంటి శ్రీనివాస్, సుభాష్, తల్లాడ శ్రీను, కీరయ్య తదితరులు పాల్గొన్నారు.