23-10-2025 02:18:46 AM
-గ్యాంగ్‌వార్లలో పొరుగు రాష్ట్రాల సుపారి కిల్లర్లు
-పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో తిష్ట వేస్తున్న
-రౌడీషీటర్లు, కిల్లర్లు
నిజామాబాద్ అక్టోబర్ 22: (విజయ క్రాంతి): నిజామాబాద్ నగర శివారు ల లో తిష్ట వేసిన అంతర్ రాష్ట్ర,జిల్లా నేరస్తులను ఏరివేయాల్సిందే అన్న అభిప్రాయం ప్రజల నుండి వ్యక్తమవుతోంది. నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ పోరుగు జిల్లా అయిన నిర్మల్ బైంసా లలో రౌడీ రౌడీ షీటర్లు నేరస్తుల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా కొన సాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని నిజామాబాద్ నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని లోని అర్సపల్లి బాబాన్సాబ్ పహాడ్ మాలపల్లి కెనాల్ కట్ట గాజుల్పేట్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న రౌడీ మూకల స్థావరాలపై దృష్టి దృష్టి సారించి రౌడీషీటర్ల ఆట కట్టించాల్సి ఉంది.
పదునై తల్వార్లు ఇతరత్రా నమర ణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు.చిన్నా పెద్ద తేడా లేకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తూ.. ప్రజల్లో భయభ్రాంతులను సృష్టిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ రౌడీషీటర్లు తో ఎందుకు గొడవ అని స్థానికులు తమకేమీ పట్టనట్టు ఉంటున్నారు.కాస్త కఠినంగా వ్యవహరించే పోలీసులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ అవినీతి పరులనే ముద్ర వేసి విస్తృత పుకార్ల ను సృష్టిస్తున్నారు.
రౌడీ షీటర్లు చోట మోట నాయకుల వెంట తిరుగుతూ పోలీసులపై రాజకీయ ఒత్తిడి తెస్తూ పోలీసుల నుండి తప్పించుకొని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.గత అధికార పార్టీలో ఒకడు ట్రాఫిక్ లో అడ్డుకున్నాడని ఏకంగా ట్రాఫిక్ అధికారి చొక్కా పట్టి గుబ గుయ్యమని పించాడు మరొకడు సూడో నక్సలైట్ అవతారం ఎత్తి పలు కేసులు లలో అరెస్టయ్యాడు. విస్తృతంగా గంజాయి రవాణాకు పాల్పడి అక్రమ సంపాదనతో ఖరీ దైన వాహనాలు కొని విఐపి అవతారం ఎత్తాడు. తెరచాటుగా వీడి కార్యకలాపాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.రౌడీషీటర్ మరొకడు ఒక అడుగు ముందుకేసి తన వద్ద ఉన్న తుపాకీతో నిజామాబాద్ నగరంలో హల్చల్ చేశాడు.తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హారిఫ్ అనే రౌడీషీటర్ కారుపై వస్తు తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆరిఫ్ అనే ఈ రౌడీషీటర్ కు పలు చోరీలు దారి దోపిడీలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది.కొందరు అవినీతి అధికారుల తోడు రాజకీయ నాయకుల చల్లని నీడ వీడిపై ఉండడంతో వీడి కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మరొకడు తన పట్ల కఠినంగా వ్యవహరించి ఉన్నపలంగా తనను చొక్కా పట్టి లాక్కెళ్ళి అరెస్ట్ చేశాడని పగబట్టి ఆ పోలీస్ పై ఫిర్యాదు చేసి రాజకీయ ఒత్తిడితో పోలీసు ను సస్పెండ్ చేయించాడు.పోలీస్ పై కక్ష కట్టిన సదరు రౌడీషీటర్ ఒకరోజు ఆ సస్పెండ్ అయినా పోలీస్ పై తీవ్ర స్థాయిలో దాడి కి పాల్పడ్డాడు.అక్రమ రవాణా జరుగుతోందని వాహనాలను తనిఖీ చేయాలని వచ్చిన ఆదేశాలతో శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
వేగంగా దూసుకొస్తున్న సుమో వాహనాన్ని ని ఆపాల్సింది గా కానిస్టేబుల్ చేయి చూపిస్తూ వాహనాన్నీ ఆపే ప్రయత్నం చేయగా మరింత వేగాన్ని పెంచిన స్మగ్లర్లు తమ వాహనాన్ని ఆపకుండా కానిస్టేబుల్ ని ఢీ కొట్టి పరారయ్యారు.ఈ ఘటనలో ఆ పోలీసు తన కాలుని నష్టపోయాడు.నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ సరిహద్దులో ఉండడంతో ఈ రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అక్రమ బియ్యం రవాణా కలప స్మగ్లింగ్ అక్రమ గుట్కా వ్యాపారం పెద్ద ఎత్తున గంజాయి రవాణా. చోరీ చేసిన వివిధ వాహనాల భాగాలను విడదీసి ఏ పార్ట్ కు ఆ పార్టు అమ్మడం విడిభాగాల ఎక్స్పోర్ట్ దర్జాగా చేస్తున్నారు.ఈ గ్యాంగులు ప్రభుత్వ భూముల్లో బజప్త షెడ్డులు నిర్మించి తమ అడ్డాగా మార్చుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
ఇటీవలే అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేశారని సమాచారంతో రెవెన్యూ పోలీసులు జరిపిన దాడుల్లో బియ్యంతో పాటు అత్యంత ప్రమాదకరమైన మరణాలు నాటు తుపాకులు కూడా దొరికిన సంఘటనలు పోలీసులను కలవర పెట్టాయి. ఇటీవల ఒప్పందం కుదిరి ఒక రౌడీషీటర్ ఒక సంఘటనలో నాటు తుపాకితో పోలీసులకు పట్టుబడడంతో వాస్తవా లు వెలుగు చూశాయి. గ్యాంగ్ వారు అక్రమ దందాలు మరణాయుధాలు కలిగి ఉండడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పోలీసులు దాడులు జరిపి కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
పోలీస్ నీ భయం లేకుండా ఏకంగా పోలీస్ పైనే దాడి చేసి కత్తితో పొడిచి పట్ట పగలు బహిరంగ అర్చలకు పాల్పడుతున్న ఈ రౌడీషీటర్ల, కిరాయి హంతకుల పై ఉక్కు పాదం మోపి అంతులు తేల్చాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. ఉండగా ఏకంగా పోలీసు నే కత్తితో హత్యకు పాల్పడిన పోలీస్ కాల్పుల్లో మరణించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తపకాయలు కాల్చి మరణించిన పోలీస్ కానిస్టే బుల్ కుటుంబానికి సంఘీభావం తెలిపారు .రౌడీ షీటర్ల పట్ల ఉక్కుపాదం మోపాల్సిందిగా ప్రజలు బలంగా కొడుతున్నారు.