08-06-2025 12:40:30 AM
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే మూ డు రోజుల పాటు మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తా యని తెలిపింది.
రేపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, న ల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగా మా, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మ ల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కా మారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా.