15-10-2025 12:43:39 AM
కలెక్టర్ పి.ప్రావిణ్య
సంగారెడ్డి, అక్టోబర్ 14(విజయక్రాంతి): సదరం క్యాంపులు వారానికి మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి లో ఏర్పాటుచేసిన సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారానికి మూడు సార్లు సదరం క్యాంపు ఏర్పాటు చేసి ప్రతిరోజు 100 మందికి సదరం క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో నమోదుచేసి ధ్రువపత్రాలను అందించడం జరుగుతుందని తెలిపారు.
సదరం క్యాంప్ కు వచ్చే వికలాంగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వికలాంగుల సదరం క్యాంపులు ఎకో ఫ్రెండ్లీ విధానంలో నిర్వహించాలని తెలిపారు. ఈ నెలలో 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో సదరం క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఓ జ్యోతి, డీడబ్ల్యూఓ లలితా కుమారి. డిఎంహెచ్ ఓ నాగనిర్మల, జిజిహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ పాల్గొన్నారు.