calender_icon.png 26 December, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాటల మంటలు సీఎం భాష సంస్కార హీనం

26-12-2025 02:18:34 AM

  1. కమీషన్లు, చిల్లర మాటలు, పార్టీలు మారడం, సీట్లు కొనడం రేవంత్‌రెడ్డి పని
  2.   5 నెలలుగా కాస్మెటిక్ చార్జీలు, మెస్ బిల్లులు ఎందుకు ఇస్తలేరు? 
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపాటు 

సిద్దిపేట, డిసెంబర్ 25 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ భాష సంస్కారహీనంగా మారిందని, రాష్ర్ట సాధకుడు కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని నాసార్‌పూర్ ఫిల్టర్ బెడ్ సమీపంలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో గురువారం బ్లాంకెట్లు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ గెలుస్తానని శపథాలు చేయడం హాస్యాస్పదమని విమర్శిం చారు.

కమీషన్లు కొట్టడం, చిల్లర మాటలు మాట్లాడటం, పార్టీలు మారడం, సీట్లు కొన డం వంటి రాజకీయ అలవాట్లు ఆయనకు కొత్త కాదని విమర్శించారు. తండ్రి లాంటి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ నీతికి విరుద్ధమన్నారు. రాష్ర్ట సాధ కు డిపై వీధి రౌడీ స్థాయిలో మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. గతంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం చర్యలు తీ సుకుంటే రేవంత్‌రెడ్డి దానిని ఖండించి, ఇ ప్పు డు అదే భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుతున్నారని ఆరోపించారు. 

20 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు 

ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, 20 శాతం కమిషన్ ఇచ్చేవారికే బిల్లులు విడుదల చేస్తున్నారని, కమిషన్ ఇవ్వని వారికి డబ్బులు నిలిపివేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చిల్లర మాటలు మాని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అ ర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని, గుడ్లు, బియ్యం నాణ్యతను హరీష్‌రావు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఐదు నెలలుగా విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు రావడం లేదని, మెస్ బిల్లులు కూడా ఐదు నెలలుగా విడుదల కావడం లేదని, సొంత డబ్బులతో మెయింటెనెన్స్ చేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నా అనాథ పిల్లలకు సక్రమంగా అన్నం పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని హరీష్ రావు విమర్శించారు.