calender_icon.png 14 May, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే 4 రోజులూ ఉరుములు, మెరుపుల వర్షాలే..

14-05-2025 12:00:00 AM

పలుచోట్ల వడగండ్ల వానలు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రాబోయే 4 రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీచేసింది. ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో రాష్ర్టంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

వీటితోపాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా పగలు ఎండలు, సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లుగా ఐఎండీ వెల్లడించింది.