calender_icon.png 11 November, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసిఫాబాద్ మండలంలో పులి సంచారం

12-08-2024 12:00:00 AM

  1. ఈ నెల 5న గోవింద్‌పూర్‌లో పాదముద్రలు 
  2. 8న కొమ్ముగూడ ఆటవీ ప్రాంతంలో దర్శనం 
  3. ఆదివారం పరందోళిలో కుక్కలపై దాడి 
  4. భయాందోళనలో గ్రామాల ప్రజలు 
  5. పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారుల గాలింపు

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగష్టు 11 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ నెల 5న గోవింద్‌పూర్ సమీ పంలోని చేనుల్లో పులి పాదముద్రలను అట వీ అధికారులు గుర్తించారు. ఈ నెల 8న కొమ్ముగూడ హబిటేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థుడు గుర్తించాడు. పులి పశువులపై దూక డంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు తెలిపాడు.

ఆదివారం కెరమెరి మండలంలోని పరందోళి అడవిలో కుక్కలపై పులి దాడి చేసింది. దీంతో గత మూడు రోజులుగా అటవీశాఖ అధికారులు పులి జాడ కోసం గాలింపు చేపట్టారు. కెరమెరి మండలంలోకి ప్రవేశించి అటు నుంచి మహారాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిందా.. ఆసిఫాబాద్ ప్రాంతంలోనే ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. కాగజ్‌నగ్‌ర్ మండంలోని అంకుసాపూర్ గ్రామ సమీపం నుంచి ఆసిఫాబాద్ ప్రాంతంలోకి ప్రవేశించినట్ల అధి కారులు భావిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి: యోగేష్, డిప్యూటి రేంజ్ అధికారి

రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించాం. పొలాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి కనిపిస్తే వెంటనే మాకు సమాచారం అందించాలి. రాత్రి పూట గ్రామాల సమీపంలో తిరుగొద్దన్ని కోరుతున్నాం. అటవీ ప్రాంతానికి వెళ్లే పశువుల కాపరులు జాగ్రత వహించాలి.