calender_icon.png 11 November, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణపై మాలల నిరసన

12-08-2024 12:00:00 AM

సుంకిడి గ్రామంలో రాస్తారోకో

ఆదిలాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాలల కులస్థులు భగ్గుమంటున్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా  తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామ లో మాల సంక్షేమ సంఘం ఆధర్యంలో అంతర్ రాష్ర్ట రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు ర్యా లీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు.

ఈ సందర్భంగా మాల సంఘం మండలాధ్యక్షుడు గుకుంటి క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో అన్నదమ్ములుగా ఉన్న మాల, మాదిగలు విడిపోయే ప్రమాదం ఉందన్నారు. వర్గీకరణపై పునరాలోచించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల సంఘం నాయకులు ముల్కల రాజేశర్, మగ్గిడి ప్రకాశ్, గడుగు పొచన్న, నిమ్మల గజానన్, నర్సిములు, దేవన్న, దిలీప్ పాల్గొన్నారు.